Hot Posts

6/recent/ticker-posts

జిల్లాలో రైస్ మిల్లర్లు, నిత్యవసర వస్తువుల డీలర్లతో జిల్లాస్థాయి ధరల మానిటరింగ్ కమిటీ సమావేశం


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: ఇటీవల కాలంలో నిత్యవసరాల ధరలు బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశాల ప్రకారం రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు మార్కెట్ ధర కన్నా 25 శాతం తగ్గించి విక్రయించాలని ఆదేశించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైస్ మిల్లర్లు, నిత్యవసర వస్తువుల డీలర్లతో జిల్లాస్థాయి ధరల మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు రైతు బజార్లు లేదా రైస్ మిల్లుల వద్ద పాఠశాలల ముందు భాగంలో బియ్యం విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసి మార్కెట్ లో కిలో 60 రూపాయల వరకు ఉందని 25 శాతం తగ్గించే అమ్మాలని సూచించారు. అదేవిధంగా కందిపప్పు సరఫరా చేసే హోల్సేల్  డీలర్లు కూడా బహిరంగ మార్కెట్లో కిలో160 రూపాయలుగా ఉందని దీనిలో25 శాతం తగ్గించి ఆయా రైతు బజార్లు వద్ద కౌంటర్లు దుకాణాలలో విక్రయించాలని సూచించారు గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ప్రాంత డీలర్లను సంప్రదించి తక్కువ ధరకు కందిపప్పును సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని  వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులను ఆదేశించారు. 


అదేవిధంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగినందున వీటి ధరల నియంత్రణపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తేగా వాటికి పరిష్కారానికి చర్యలు తోపాటు పేరూరు భారత ఆహార సంస్థ గిడ్డంగి వద్ద స్థల సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఎక్కడ కృత్రిమ కొరతకు ఆస్కారం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ పాపారావు, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఎస్.సుధా సాగర్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు కే విశాలాక్షి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభిరామా రావు, ఉపాధ్యక్షులు గణేశుల వెంకట కొండలరావు, కార్యదర్శి ఇండేగల బుజ్జి హోల్సేల్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.