ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసియున్న, జగజ్జననీ, జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీమాత శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి వార్షికోత్సవం 1964 నుండి వేడుకల్లో భాగంగా ఉన్న అమ్మ వారికి అష్టోత్తర శతకలశాభిషేకం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో పూర్వపు మున్సిపల్ చైర్ పర్సన్ బంగారు శివలక్ష్మి, ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా మండలి జనాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అభిషేకించారు.
ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి జరిగే ఈ విశేష కార్యక్రమాల్లో జలాభిషేకం జీవ చైతన్యాన్ని పెంపొందిస్తుందని జలంతో అభిషేకించడం వల్ల సువృష్టి సస్యశ్యామలంగా ఈ ప్రాంతం విరాజిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
శ్రీ నూకాలమ్మ అమ్మ వార్లు విశేష అలంకరణలో దర్శన మిచ్ఛారు. నిత్య పూజా కైంకర్యాలు ఆలయ అర్చక స్వాముల బృందం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పా లంకరణ మరియు ప్రసాద వితరణకు కారింగుల రామకృష్ణ మూర్తి,శ్రీరామనాగరత్నం దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు సహకరించారు.
వీరంపాలెం శ్రీబాలా త్రిపుర సుందరిపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సూచనల మేరకు మూడు రోజులపాటు వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నందుకు డాక్టర్ రాజన సత్యనారాయణ భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
జలాభిషేక అనంతరం భక్తులందరికీ స్థానిక పీ.ఏ.కృష్ణమూర్తి, సుజాత దంపతుల ద్రవ్య సహాయంతో అన్నప్రసాద వితరణను మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ ప్రారంభించారు. విచ్చేసిన భక్తులు అమ్మవారి కార్యక్రమాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రొంగల నాగేశ్వరావు, పోలుపర్తి రాము, చిట్లూరి సర్వేశ్వరరావు, చింతకాయల అచ్చిరాజు, నూకల సత్యనారాయణ, అబ్బిన కాశీవిశ్వనాథ్, నౌడు నూకరాజు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూచి కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Social Plugin