Hot Posts

6/recent/ticker-posts

ఇంటర్వూలందు జగన్ ఇంటర్వూ వెరయా... ఒక్కసారి ఇది చూడవయా!


ప్రధానంగా ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడు ఏ రచ్చబండ దగ్గరైనా, ఏ టీ కొట్టు దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది. ఒక్కో జనరేషన్ లో ఒక్కో విషయంలో ఒక్కో స్టార్ ఉంటారనేది తెలిసిన విషయమే. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ... మైదానంలోకి అడుగుపెడితే రచ్చ రచ్చే! బాలీవుడ్ లో ఒకప్పుడు అమితాబ్, ఇప్పుడు షారుఖ్ సినిమా విడుదలయ్యిందంటే ఎక్కడ చూసినా అదే చర్చ! ఈ క్రమంలోనే రాజకీయాంలో నాడు వైఎస్సార్, ఇప్పుడు వైఎస్ జగన్ అని చెప్పుకుని తీరాల్సిందే! ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా వారి మధ్య "జగన్" అనే ప్రస్థావన రాకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో! 


ఆయనే స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారంటే ఇక ఆ సందడి ఎలా ఉంటుందనేది బుధవారం ఏపీ మొత్తానికి మరోసారి తెలిసిందనే చెప్పాలి. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. లైవ్ జరుగుతున్నప్పుడే కానీ.. యుట్యూబ్ లో కానీ ఆ ఇంటర్వూని ప్రజానికం లక్షల్లో వీక్షించారు. ఇప్పటికీ యూట్యూబ్ లైవ్ లో వేల వేల వ్యూస్ కనిపిస్తుండటం గమనార్హం. ప్రధానంగా ఆ ఇంటర్వూలో భాగంగా... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అభివృద్ధి, సంక్షేమం వంటి పలు అంశాలకు సంబంధించిన సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను సదరు యాంకర్ లేవనెత్తగా... జగన్ సవివరంగా వివరించారు. 

ఇందులో భాగంగా... ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి లేవనెత్తిన సందేహాలు, ప్రత్యర్థులు చేసిన పలు అవగాహనారాహిత్యపు విమర్శలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు! అసలు తన విజన్ ఏమిటి, తన పాలనా విధానం ఏమిటి, తన లక్ష్యం ఏమిటి, ప్రజలకు సేవ చేసే విషయంలో తనకు ఉన్న స్పష్టత ఏమిటి అనే విషయాలను వీలైనంత వివరంగా వివరించారు జగన్. ఇదే క్రమంలో... పవన్ కల్యాణ్ ప్రస్థావన వచ్చినప్పుడు జగన్ వేసిన పంచ్ డైలాగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... "తప్పు ఒకసారి చేస్తే పొరపాటు.. రెండో సారి చేస్తే గ్రహపాటు.. మూడు నాలుగోసారి చేస్తే అది అలవాటు" అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయని అంటున్నారు. 

ఇలా ప్రతీ విషయంపైనా వీలైనంత స్పష్టంగా, సూటిగా, ప్రజలందరికీ అర్ధమయ్యేలా సాగిన ఈ ఇంటర్వూలోని కొన్ని అత్యంత అసక్తికర బైట్స్ ని కట్ చేసి మరీ వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో ఆయా వీడియోలకు వచ్చిన వ్యూస్ ని స్టేటస్ లలో పెడుతూ... జగన్ క్రేజ్ ని మరోసారి చెబుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వైసీపీ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపిందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఒక టీవీ ఛానల్ లో జగన్ ఇంటర్వ్యూ వస్తున్న సమయంలో.. మరో ఛానల్ లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదని.. ఆ లైవ్ చూసే వాళ్ళు కరువయ్యారని తెలుస్తుంది. 

ఈ సందర్భంగా జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా.. చంద్రబాబు ఇంటర్వూని వేలల్లో చూస్తున్న విషయానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి! వీటి మీమ్స్ వైరల్ గా మారుతున్నాయి! దీంతో చంద్రబాబు చెప్పే ఊకదంపుడు ఉపన్యాశాలన్నీ గాలి మాటల మూటలు అని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే ఆయన ఇంటర్వూలను, ప్రసంగాలను జనం చూడటం లేదనే చర్చ నెట్టింట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారు తప్ప వాటిల్లో నిబద్ధత లేదని, ఇంతకాలం ముఖ్యమంత్రిగా పని చేసి తానేమి చేశానో చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటూ.. రేపు అద్భుతం చూపిస్తానంటే నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజానికం లేదనే కామెంట్లు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఒక పక్క మోడి రోడ్ షో జరుగుతున్నా.. మరోపక్క చంద్రబాబు ఇంటర్వూ టెలీకాస్ట్ అవుతున్నా.. వాటి వ్యూస్ పల్చబడిపోగా.. జగన్ క్రేజ్ ని తాజా ఇంటర్వ్యూ వ్యూస్ మరోసారి కళ్లకు కట్టినట్లు చూపిస్తునాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే... "క్రేజ్ కా బాప్" అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! రాబోయే ఫలితాలకు ఇది చిన్నపాటి సంకేతమనే చర్చా మొదలైందని అంటున్నారు!