Hot Posts

6/recent/ticker-posts

వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మహానటి.. కొల్లు రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని సంచలనం!


ANDHRAPRADESH:వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ అయిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతి రెడ్డి మహాతల్లి అని కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారని, కానీ నెల్లూరు జిల్లాలో ఎవరిని మైనింగ్ చేయనీయకుండా వేమిరెడ్డి వారే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆమె మహాతల్లి అయ్యిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

కొల్లు రవీంద్ర కంటే పగటి వేషగాడు ఎవరూ లేరు

ఇక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్న కొల్లు రవీంద్ర కంటే పగటి వేషగాడు ఏపీలో మరి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు . ఏపీలో చంద్రబాబు హయాంలో తప్పుడు కేసుల పరిపాలన కనిపిస్తోందని మండిపడ్డారు. తప్పుడుకేసులు నమోదుచేసి అరెస్టు చేస్తే న్యాయస్థానాలలో నిలబెడతామని పేర్ని నాని హెచ్చరికలు జారీ చేశారు. కక్ష సాధింపు చర్యలకు దిగడం తప్ప కూటమి ప్రభుత్వం చేస్తుందేమీ లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన 

సీఎం చంద్రబాబు ఏలుబడిలో తెరవెనుక నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారు అని లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ, బీసీ చైర్పర్సన్ టిడిపి దుర్మార్గాలను నిలదీయగానే పిల్లి మొగ్గలు వేశారని పేర్ని నాని అన్నారు. ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉప్పాల హారిక పైన దాడి చేసి కేసులు 

జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కుటుంబం పైన కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని, ఉప్పాల హారిక పైన దాడి చేసి మళ్ళీ ఉప్పాల రాము పైన కేసు నమోదు చేయడం దారుణమని ఆయన అన్నారు. టిడిపి మహిళా కార్యకర్తలతో తప్పుడు ఫిర్యాదులు చేయించారని కొడాలి నాని ఫ్లెక్సీ చించేసి, చేతికి గాయం అయితే కారుతో తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్ని నాని అన్నారు.

13 నెలలుగా కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్న సర్కార్

వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి వాళ్లే కేసులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. గత 13 నెలలుగా కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారి పైన కేసులు పెడుతున్నారని, గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టిడిపి నాయకులేనని పేర్ని నాని అన్నారు.