Hot Posts

6/recent/ticker-posts

వయాగ్రా టాబ్లెట్ పుట్టుక వెనుక కథ తెలుసా?


ఫలితంగా అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి నోటి మాత్ర అంటూ 1998లో అమెరికా, బ్రిటన్‌ లో వయాగ్రా మార్కెట్లలోకి వచ్చింది. అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని! వాస్తవం చెప్పాలంటే వయాగ్రా కూడా ఇలానే పుట్టింది. మరో మందుకోసం ప్రయత్నిస్తుంటే.. మరోచోట రియాక్షన్ వచ్చింది! దీంతో నాడు పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫలితంగా అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి నోటి మాత్ర అంటూ 1998లో అమెరికా, బ్రిటన్‌ లో వయాగ్రా మార్కెట్లలోకి వచ్చింది. అమ్మకాల్లో చరిత్ర సృష్టించింది! 

బ్రిటన్‌ లోని కార్మికుల ఇబ్బందులే పునాధి!: Also Read - 47 ఏళ్ల వయసులో ఇంతటి సాహసమా..? బ్రిటన్‌ లోని సౌత్ వేల్స్‌ లో మెర్తిల్ ట్విడ్‌ ఫిల్ అనే చిన్న పారిశ్రామిక పట్టణం ఉంది. అక్కడున్న ఒక ఉక్కు పరిశ్రమ మూతపడడంతో స్థానికంగా ఉండే కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి రోజువారీ ఆహారం దొరకడం కూడా కష్టమైపోయింది. ఈ సమయంలో వారి ఆర్ధిక ఇబ్బందులే వారిని క్లినికల్ గినీ పిగ్స్‌ గా మార్చేసింది. నాడు వీరు అంగీకరించకపోతే వయాగ్రా పుట్టేదేకాదు అని అన్నా అతిశయోక్తి కాదు! 1990ల ప్రారంభంలో అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టేందుకు ఔషధాలు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డెనాఫిల్ యుకె-92,480 అనే ఒక కాంపౌండ్‌ ను పరీక్షిస్తోంది. ఈ సమయంలో ఔషధాన్ని పరీక్షించడానికి స్థానిక యువకులను రిక్రూట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 1992లో ఆ కొత్త ఔషధాన్ని పరీక్షించే ప్రక్రియలో పాల్గొనడానికి ఆ పట్టణంలోని కార్మికులు అంగీకరించారు. 

ఈ సమయంలో ఈ క్లీనీకల్ ట్రైల్స్ లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు యుకె-92,480 పిల్‌ ను రోజుకు మూడు సార్లు చొప్పున వరుసగా పది రోజులపాటు వేసుకోవాలని కంపెనీ వాళ్లు చెప్పారు. అందుకు కొంత డబ్బు చెల్లించారు. దానివల్ల వారికి మూడు పూటలా ఆహారంతోపాటు చలి కాచుకోడానికి అవసరమైన బొగ్గు సంచులు కూడా కావాల్సినన్ని దొరికేవి! వయాగ్రాకు దారితీసిన సైడ్ ఎఫెక్ట్!: ఇలా క్లీనికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ డ్రగ్ వల్ల యువకుల్లో ఒక అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్ కనిపించింది. అవును... ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల అంగస్తంభన మామూలు కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోందని వాళ్లు వైద్యులకు తెలిపారు. ఇదే సమయంలో ఇంతకు ముందుకంటే ఎక్కువగా అంగం గట్టిపడినట్లు అనిపించిందని వెల్లడించారు. 

ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ ను గమనించిన ఫైజర్ సంస్థ.. అప్పటికే జరుగుతున్న అధిక రక్తపోటు సంబంధ అధ్యయనంతోపాటూ నపుంసకత్వంపై కూడా రీసెర్చ్ చేయడానికి నిధులు సమకూర్చింది. ఈ క్రమంలో 1994 ప్రాంతంలో స్వాంజీలో తమ తదుపరి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు అంగస్తంభన సమస్యలు ఉన్న రోగులకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించింది. ఇలా స్వాంజీలో జరిగిన అధ్యయనంలో ఫైజర్ సంస్థకు పాజిటివ్ ఫలితాలు కనిపించాయి. దీంతో తమ చేతిలో ఉన్న ఔషధం చరిత్ర సృష్టించబోతోందని వారికి త్వరగానే అర్థమైంది. ఈ సమయంలో ఈ పరీక్షల ఫలితాలు ఎంత పాజిటివ్‌ గా ఉన్నాయంటే... ట్రయల్స్‌ లో పాల్గొన్న మగవాళ్లు కొందరు వారికి ఇచ్చిన టాబ్లెట్లను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. 

తాజాగా వారు కనుగొన్న డ్రగ్.. అంగస్థంభన సమస్యకు చెక్ పెడుతుందని కన్ ఫాం చేసుకున్న ఫైజర్ ఈ మాత్రలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తన మార్కెటింగ్ టీం ని రంగంలోకి దింపింది. ఈ సమయంలో కొందరు నిపుణులు... ఇది అవసరమైన డ్రగ్ అవుతుందా.. లేక, కొత్త సమస్యలకు కారణం అవుతుందా అనే సందేహాలనూ వ్యక్తపరిచారట. ఈ సమయంలో నపుంసకత్వం అనేది ఒక వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపిస్తుంది, వివాహ సంబంధాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది అనే విషయాలను గ్రహించిన ఫైజర్ మార్కెటింగ్ హెడ్... నపుంసకత్వానికి విరుగుడుగా భావిస్తున్న ఈ డ్రగ్ లైంగిక సంబంధాలను చక్కదిద్దగలదనే మెసేజ్ ను మార్కెట్ లోకి తీసుకెళ్లారు. 

ఈ సమయంలో ఈ డ్రగ్‌ కు వాటికన్ నుంచి మతపరమైన ఆశీస్సులు కూడా లభించాయి. మార్కెట్లలోకి వయాగ్రా... ముహూర్తం ఫిక్స్!: ఈ సమయంలో అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి టాబ్లెట్ అంటూ 1998 మార్చి 27న ఎఫ్.డీ.ఏ. అప్రూవల్ పొందింది. అనంతరం అమెరికా, బ్రిటన్‌ లో వయాగ్రా మార్కెట్లలోకి వచ్చింది. అలా వచ్చీ రాగానే సంచలనాలు సృష్టించిన ఈ డ్రగ్... 2008 కల్లా దాదాపు 200 కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో ఫార్మా చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న డ్రగ్‌ గా రికార్డులకెక్కింది. 

ఇదే సమయంలో... మారుతున్న కాలానికి, జీవిన శైళికి అనుగుణంగా పెరుగుతున్న అంగస్తంభన సమస్య వల్ల ఈ వయాగ్రా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా... 1995 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది ఈ అంగస్తంభన సమస్యలు ఎదుర్కొన్నారని... అయితే 2025 నాటికి వీరి సంఖ్య 32 కోట్ల మందికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి!