Hot Posts

6/recent/ticker-posts

అమలు చేయదగిన మ్యానిఫేస్టోనే చెప్పాం : యనమల


పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని.. ఆదాయాన్ని పెంచుతామన్నారు. 


ఖర్చులు తగ్గించుకోని..
అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రెండు నుంచి మూడు వేల కోట్లను ఆదా చేయవచ్చని యనమల తెలిపారు. పన్నులు వేయకుండా.. వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతామన్న యనమల నాన్ ట్యాక్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలు పెరిగేలా ఫోకస్ పెడతామన్నారు. తాము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటామని యనమల రామకృష‌్ణుడు చెప్పారు.