Hot Posts

6/recent/ticker-posts

ఎన్నికల ఐదు అంశాలకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు


Andrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించింది.. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు బాధ్యతల్ని స్వీకరించారు. ఎన్నికల హామీల్లో ఐదు అంశాలకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు చేశారు. డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పింఛన్లు రూ.3వేల నుంచి 4వేలకు పెంపు, నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్), అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించే హామీలను నెరవేరుస్తూ.. ఆ ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అయితే చంద్రబాబు దేశంలోని తొలిసారి ఏపీలో అమలు చేయబోతున్న ఓ హామీ పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో నుంచి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


చంద్రబాబు సంతకం చేసిన ఫైల్స్‌లో స్కిల్ సెన్సెస్ (నైపుణ్య గణన) కూడా ఉంది. అయితే నైపుణ్య గణన ఆలోచన పవన్ కళ్యాణ్‌ది అని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు.. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే పవన్ కళ్యాణ్‌ ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఆ ఫైల్‌పై కూడా సంతకం చేయడంతో.. త్వరలోనే నైపుణ్య గణన కూడా ప్రారంభంకానుంది. దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే స్కిల్ సెన్సెస్ లెక్కలు తీయబోతున్నారు.. అయితే ఈ ఆలోచన పవన్ కళ్యాణ్‌ది అని తెలియడంతో జనసైనికులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అంతేకాదు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో.. ఫైల్స్‌పై సంతకాలు చేసిన తర్వాత కొందరు విద్యార్థులత కొద్దిసేపు ముచ్చటించారు. వారంతో భవిష్యత్‌ ఉపాధి అవకాశాలపై ఇచ్చిన సలహాలు, వినతులను ఆసక్తిగా విన్నారు.. కొన్ని ఆలోచనలు బావున్నాయని స్వాగతించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కోసం ఎంత చేయాలో అంద చేస్తానన్నారు చంద్రబాబు. ఓ విద్యార్థి అందరికీ ఐటీ అంటే ఆసక్తి ఉండదని.. అందుకే హోటల్ మెనేజ్‌మెంట్, ఫిల్మ్ మేకింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు అందుకునేలా ప్రోత్సహిస్తే బావుంటుందన్నారు. ఈ ఆలోచన బావుందని చంద్రబాబు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో తనకు జరిగిన సంభాషణను చంద్రబాబు గుర్తు చేశారు. 'సినిమాల్లో హీరోగా ఉన్న తన అన్న మెగాస్టార్ చిరంజీవి.. తనకు కొద్దిగా నటన నేర్పాడని.. దానిని అందిపుచ్చుకుని స్వయంకృషితో పైకి ఎదిగానని' తనతో చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

యువత కోసం ఒక్క ఐటీనే కాకుండా ఏ రంగంలో అవకాశాలు బాగుంటే ఆ రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్‌ వర్క్‌ స్టేషన్ల పేరుతో కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. రాష్ట్రంలో ఎకానమీ పెరిగితే చిన్న ఉద్యోగాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువత సొంతంగా స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభించడానికి సాయం చేయాలని మరో విద్యార్థి కోరారు.. సరైన శిక్షణ, చేయూత లేకపోతే స్టార్టప్‌లు ఫెయిలయ్యాయని.. అందుకే సరైన ప్రణాళికలు అవసరం అన్నారు.. ఆ దిశగా కచ్చితంగా సాయం అందిస్తామన్నారు.

మరోవైపు చంద్రబాబు ఐదు ఫైల్స్‌పై సంతకాలు చేయడంపై ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం దిశగా తీసుకెళ్లేందుకు తొలి అడుగులు పడ్డాయన్నారు. మెగా డీఎస్సీకి సంబంధించి ఫైల్ మీద ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు పునరుద్ధణ, స్కిల్ సెన్సస్ ఫైల్స్‌పై సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందన్నారు జనసేనాని. మరోవైపు తనను కలవడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని కోరారు.. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని చెప్పారు జనసేన అధినేత.