Hot Posts

6/recent/ticker-posts

మ్యానిఫేస్టోలో మోదీ ఫొటో.. అడ్వర్‌టైజ్‌మెంట్ లో పవన్ ఫొటో మాయమయిందే


మ్యానిఫేస్టోలో మొన్న మోదీ ఫొటో మాయమయిందని, అడ్వర్‌టైజ్‌మెంట్ లో ఈరోజు పవన్ కల్యాణ‌‌్ ఫొటో కనపడటం లేదని పేర్ని నాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కుయుక్తులకు మిత్ర పక్షాలు ఎవరైనా బలి కావాల్సిందేనని అన్నారు. జగన్ అంటే నడిచే నమ్మకమన్న పేర్ని నాని చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలను ఎవరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు మోసంలో తాము భాగస్వామ్యులం కాలేమని బీజేపీ ముందుగానే తప్పుకుందని అన్నారు. ఇచ్చిన హామీలు కూడా ప్రకటనల్లో మయమవుతున్నాయన్నారు. 99 మ్యానిఫేస్టోలోనూ చంద్రబాబు దగా చేశారని, 2014 ఎన్నికల మ్యానిఫేస్టోలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.


మరోసారి నమ్మితే... 
2019 లో పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని, ఒక్క ఆయన కొడుకుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అలివి కాని వాగ్దానాలతో అమలు చేస్తామని చెబుతుంటే.. దానికి ఆయనకు మద్దతు పలికే మీడియా భజనలు చేస్తుందన్నారు. ప్రజలు వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని పేర్ని నాని పిలుపు నిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసునని అన్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పకుండా సంపద సృష్టిస్తానంటూ బిల్డప్పులు ఇస్తున్నారు తప్పించి అది అయ్యే పని కాదని నాని అన్నారు.