బెంగళూరు: బీజేపీది చీకటి పాలన అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఈ చీకటి పాలనను అంతమొందించడం అందరి బాధ్యత అని అన్నారు. శనివారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కర్ణాటకలో మూడున్నరేళ్ల బీజేపీ పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. 2018లో బీజేపీకి ప్రజలు అధికారం ఇవ్వకపోయినా, అక్రమ మార్గంలో పాలనకు వచ్చి లూటీ చేసిందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర చేయడంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. కర్ణాటకతో కాంగ్రెస్‌కు అవినాభావ సంబంధం ఉందని, ఇందిరాగాంధీకి చిక్కమగళూరులో, తనకు బళ్లారిలో ఆశీస్సులు అందించారని ఆమె తెలిపారు.
Social Plugin