పెదపాడు మండలం తాళ్ల గూడెం నుండి ఒక దివ్యాంగురాలు తనకు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పరిచయమైన వ్యక్తి తనతో సహజవనం చేసి తనకు ముందుగా పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి మోసం చేసిన విషయంపై దిశ పోలీస్ స్టేషన్ నందు విచారణ చేయుచుండగా సదరు విచారణలో ఫిర్యాదును ఉసంహరించుకోవాలని లేదా తాను చనిపోయి తనపై కేసు పెడతానని బెదిరిస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం గ్రామం నుండి ఒక మహిళ ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో నమ్మించి పలుమార్లు తనకు ఇష్టం లేకుండా అత్యాచారం చేసిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి పది లక్షల అధిక కట్నం కావాలని వేధింపులు గురి చేస్తున్న విషయంపై చర్యలు తీసుకోవలసినదిగా కోరింది.
ఏలూరు మండలం జాలిపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గ్రామంలో కొంతమంది తాను చేతబడులు చేస్తున్నానని అసత్య ప్రచారం చేస్తూ చంపుటకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు.
మండవల్లి మండలం సింగనపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన తల్లిని తన కుటుంబ సభ్యులకు తెలియకుండా విదేశాలకు పంపించినట్లు అతని తల్లి ఎక్కడ ఉన్నది తనకు తెలియనట్లు సదర విషయంపై అతని తల్లిని విదేశాలకు పంపించిన వారిని అడుగగా ఏ విధమైన సమాధానం చెప్పకుండా బెదిరిస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు.
టీ నర్సాపురం మండలం తిరుమల దేవి పేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ది 04.05.2023వ తేదీ నాడు పొలంలో కట్టిన గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయిన విషయంపై చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరాడు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై సత్వరమే చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాటలాడి ఆదేశాలు చేయడమైనది.
అనంతర స్పందన కార్యక్రమమునకు జిల్లా నలుమూలల నుండి హాజరైన ప్రజలకు ఏలూరు శ్రీ సత్యసాయి సంఘం ఆధ్వర్యంలో భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీకి ప్రజలు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఈ మధ్యకాలం సైబర్ నారగాళ్లు అమీజాను, ఫ్లేప్ కోర్ట్, నేప్టాల్ తదితర సంస్థల నుండి మీకు బహుమతులు వచ్చాయని ఫోన్ చేసి మోసం చేసే సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తతంగా ఉండాలని ఈ పత్రికా ప్రకటన ద్వారా జిల్లా ప్రజలకు తెలిపారు.
Social Plugin