Hot Posts

6/recent/ticker-posts

రాతి యుగం లాంటి జగన్ పాలనకి స్వస్తి పలికి.. స్వర్ణయుగానికి ఆహ్వానం పలకాలి



కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు: రాతి యుగం లాంటి జగన్ పాలనకి స్వస్తి పలికి.. స్వర్ణయుగానికి ఆహ్వానం పలకాలి అని ప్రత్తిపాడు నియోజకవర్గ NDA కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్య ప్రభ రాజా అన్నారు. రాష్ట్రానికి స్వర్ణ యుగం రావాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన ప్రతీ వ్యక్తి అభివృద్ధి కోరుంటాడు. అభివృద్ధి గురించి ఆలోచించక పోతే ఆది మానవుడు ఇంకా అడవులలోనే ఉండేవాడని, నిప్పు, చక్రం కనుకొని, తద్వారా పనిముట్లు తయారు చేసుకొని వ్యవసాయం చేసేవాడు కాదు అన్నారు.

అభివృద్ధి చెందాలి అనేది ప్రతి మనిషి, నర నరానా ఉంటుందని మన రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. రాతి యుగం లాంటి జగన్ పాలనకు స్వస్తి చెప్పి, స్వర్ణ యుగం లాంటి పాలన వైపు అడుగులు వేయాలని, అలా జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జరుగుతుందని ఆమె అన్నారు. స్వర్ణ యుగం వైపు రాష్ట్రాన్ని నడిపించగల సమర్ధత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడుకి డ్రైవర్ సీటు ఇస్తే రాష్ట్ర ప్రజలు అందరూ సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతారని ప్రజలకు పిలుపునిచ్చారు. అనుభవం, సమర్ధత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలకు తెలుసు అన్నారు. 

పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే మన రాష్టంలో ఇంకా గంజాయి, డ్రగ్స్ లో అభివృద్ధి చెందుతున్నారు. యువత, రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్నీ వర్గాల వారు చంద్రబాబునాయుడుని కోరుకొంటున్నారని అన్నారు. యువతకి భవిష్యత్ కావాలన్నా.. భావితరాల వారికి ఉపాధి కావాలన్నా చంద్రబాబు నాయుడు సిఎం కావాలి అని ఆమె చెప్పారు. లేదంటే ఈ రాష్ట్రంలో గంజాయి వ్యవసాయం పంటగా అవుతుందని, డ్రగ్స్ యువత భవిత అవుతుందని అన్నారు. మహిళలు రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం మహిళలు అందరూ చంద్రబాబు నాయుడుకి మద్దత్తు తెలపాలి అని కోరారు.

చంద్రబాబునాయుడు అయితే ప్రపంచంతో పోటీ పడతారని, యువత భవిష్యత్ నిర్మిస్తారని, భావితరాల భవిష్యత్ కోసం చంద్రబాబుని NDA కూటమిని బల పరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్, మండల టీడీపీ శ్రేణులు అలమండ చలమయ్య, దనేకుల భద్రరావు, అదృష్ట దీపుడు, సంగన ప్రభూజి, వనుం మంగ, కొల్లా శ్రీను, అచ్చే వీరబాబు, బారి సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.