Hot Posts

6/recent/ticker-posts

వాలంటీర్లు నెలకు రూ.30 - రూ.50వేలు.. స్కిల్ డెవలప్మెంట్ అంటున్న బాబు!


తాజాగా ఈ రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి గడప గడపకూ వెళ్లి... రానున్న ఎన్నికల్లో లక్ష మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. స్కిల్ డెవలప్ మెంట్ అనగానే ఒకప్పుడు ఏమి గుర్తొచ్చేది అనే సంగతి కాసేపు పక్కనపెడితే... గత కొన్ని నెలలుగా మాత్రం ఏపీలో చాలా మందికి చంద్రబాబు అరెస్టు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతులే గుర్తొస్తాయని చెప్పినా అతిశయోక్తి కాదు. కారణం... స్కిల్ డెవలప్ మెంట్ (స్కాం) అనే విషయం ఏపీలో అంత హాట్ టాపిక్ గా మారింది! ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నోట "స్కిల్ డెవలప్మెంట్" అనే మాట వచ్చింది. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ప్రస్తుతం కుప్పంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో... ఆ నియోజకవర్గాన్ని రానున్న ఐదేళ్లలో అభివృద్ధి చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా ఈ రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి గడప గడపకూ వెళ్లి... రానున్న ఎన్నికల్లో లక్ష మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణ యువతతో బాబు మాట్లాడారు. ఇందులో భాగంగా... జగన్ పరిపాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్ కేలండర్ అంటూ యువతను, నిరుద్యోగులనూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఇక, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని చెప్పిన బాబు... ఏపీలో గ్రూప్ - 1 పోస్టులను ఇష్టారీతిన కావాల్సిన వారికి ఇచ్చారని ఆరోపించారు. 

గతంలో ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్తదారి చూపించినట్లు చెప్పిన చంద్రబాబు... భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం తీసుకొస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో... అన్ని మండల కేంద్రాల్లోనూ వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా విజన్ ను తయారుచేస్తామని తెలిపారు. ఇదే సమయంలో.. వాలంటీర్ల ప్రస్థావనా తెచ్చారు బాబు. ఇందులో భాగంగా... తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ సంపాదించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే... స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో... చాలా కాలం తర్వాత చంద్రబాబు నోట వాలంటీర్ల జీతాలు, జీవితాలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ అనే మాట వినిపించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.