జంగారెడ్డిగూడెం: పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) రామలక్ష్మి దంపతుల నేతృత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ ఆలయ కళ్యాణకళా వేదిక వద్ద ఉత్సవ ముర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం మూల విరాట్ కు ఏకాదశ మంగళ నీరాజనాలతో, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి నీరాజన మహా మంత్రాలతో, సాయం సంధ్యా హారతి పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ మరియు ప్రసాదవితరణకు కాకొల్లు ద్వారకానాగవెంకటమణికంట , దుర్గాస్నేహిత దాంపతులు రూ.5,116/లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రముఖులు, మహిళలు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొని, ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Social Plugin