Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో 598 మంది లబ్ధిదారులకు రూ.4.62 కోట్ల ఆర్ధికసాయం

 


ఏలూరు: ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు,  వైయస్సార్ షాదీ తోఫా  కింద 598 మంది లబ్దిదారులకు రూ. 4.62 కోట్ల నిధులను లబ్దిదారుల ఖాతాలకు జమచేసినట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. 


 తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద జనవరి, మార్చి - 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు.  


ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్,  నగర మేయర్ షేక్ నూర్జహన్ పెదబాబు ,ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యే లు తలారి వెంకటరావు, దూలం నాగేశ్వర రావు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ,  డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, మెప్మా పిడి ఇమ్మానియల్,సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన రావు, మున్సిపల్ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, వ్యవసాయశాఖ జేడి రామకృష్ణ, డిఎల్ డిఓ రమణ, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.  


జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 598 మంది జంటలకు రూ. 4.62 కోట్లు లబ్దిచేకూరిందన్నారు.  వీరిలో బిసి కులానికి చెందిన 306 మందికి రూ. 1.62 కోట్లు, ఎస్సీలకు చెందిన 238 మందికి రూ. 2.43 కోట్లు, ఎస్టీలకు చెందిన 25 మందికి రూ. 25.80 లక్షలు, మైనారిటీలకు చెందిన 20 మందికి రూ. 20 లక్షలు, విభిన్న ప్రతిభావంతులకు చెందిన 7గురికి రూ. 10.50 లక్షలు, ఇతరులు ఇద్దరుకు రూ. 80 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిందన్నారు. 


ఈ సందర్బంగా ఏలూరుకు చెందిన జి. ఉమాదేవి , కృష్ణప్రసాద్ దంపతులు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్పరెన్స్ లో నేరుగా మాట్లాడుతూ తమకు వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు కింద రూ. 50 వేలు ఆర్ధికసాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సొమ్మును సద్వినియోగం చేసుకుంటానన్నారు.  మాది నిరుపేద కుంటుంబమని తన తండ్రి గున్నపు శ్రీనివాసరావు లాండ్రీ వృత్తితో ముగ్గురు పిల్లలను పోషిస్తూ వచ్చారన్నారు.  తన తండ్రి చేదోడు, తల్లి లక్ష్మి వై.ఎస్.ఆర్. ఆసరా  లబ్దిపొందారన్నారు.  తానుకూడా వై.ఎస్.ఆర్. ఆసరా ఆర్ధికసాయాన్ని పొందానన్నారు.  ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా ఇంటర్ తో విద్యకు స్వస్తి పలకాలనుకున్న మీరు కల్పించిన ఫీజురీయింబర్స్ మెంట్ తో డిగ్రీ పూర్తిచేశానని తన చెల్లెలు కూడా ఇంటర్ చదువుతున్నదని చెప్పారు.