Hot Posts

6/recent/ticker-posts

నర్సీపట్నంలో వలంటీర్లతో ఎమ్మెల్యే స్పెషల్ భేటీ.. అవాక్కయ్యే ట్విస్టు


కొన్ని ఉదంతాల్ని చూస్తే.. చిన్న లాజిక్కులు మిస్ కావటం విస్మయానికి గురి చేస్తుంది. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనూహ్య పరిణామాలు.. షాకింగ్ సీన్లు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల మధ్య వైరం వ్యక్తిగత స్థాయికి చేరిన వేళ.. ఎన్నికల్ని.. వాటి ప్రచారాల్ని.. ఇతరత్రా అంశాల్ని పర్సనల్ గా తీసుకోవటం ఎక్కువగా కనిపిస్తోంది. 


కొన్ని ఉదంతాల్ని చూస్తే.. చిన్న లాజిక్కులు మిస్ కావటం విస్మయానికి గురి చేస్తుంది. తాజాగా నర్సీపట్నంలో అలాంటి సీన్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఏపీలోని వలంటీర్ల వ్యవస్థ మీద కోర్టు తీర్పులు ఇవ్వటం.. వారి సేవల విషయంలో పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. నర్సీపట్నంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నర్సీపట్నంలోని వెంకునాయుడు పేటలోని ఒక ఇంట్లో ఎమ్మెల్యే గణేశ్.. వాలంటీర్లతో ప్రత్యేక భేటీని నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ సమావేశం గురించి టీడీపీ వర్గీయులకు సమాచారం అందింది. 

దీంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున సదరు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సమయంలోనే కొందరు వాలంటీర్లు ఇంటి గోడలు దూకి పారిపోయారు. ఈ టైంలోనే ఎన్నికల అధికారులు సైతం ఇంటి వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇంటి గదులన్నీ తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఒక గదికి లోపల గడియ పెట్టుకున్నట్లుగా గుర్తించారు. ఆ గది తలుపు తీయాలని గట్టిగా కోరటంతో.. లోపల ఉన్న వారు తలుపు తెరిచారు. 

గది లోపల 15 మంది వాలంటీర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. సందట్లో సడేమియా అన్నట్లు ఈ వ్యవహారం జరుగుతున్న వేళలోనే ఎమ్మెల్యే గణేశ్ మరో కారులో వెళ్లిపోయినట్లు ఆరోపిస్తున్నారు. ఏమైనా.. నర్సీపట్నంలో తాజాగా వెలుగు చూసిన ఉదంతం అక్కడి పొలిటికల్ హీట్ ను మరింత పెంచినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.