Hot Posts

6/recent/ticker-posts

అధికార వైసీపీ నాయకులు చర్చకు సిద్ధమా.. : నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్


డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట: నియోజకవర్గంలో గతంలో పంట కాలువలు, ఇటుక బట్టీల సర్వే నెంబర్లతో వైసీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై లక్షలాది రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని దోచేసిన వ్యవహారంలో ఇంతవరకు సొమ్ము రికవరీ చేయలేక పోయారని, దీనిపై అధికార వైసీపీ నాయకులు చర్చకు సిద్ధమా అని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సవాల్ విసిరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేసిన పర్యటనకు రైతులు, ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఓర్వలేక కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆయనపై రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లనే అకాల వర్షాలకు రైతులు నష్టపోయారన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.