Hot Posts

6/recent/ticker-posts

జనాభా నియంత్రణలో వైద్యులు విశేష కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వెల్లడి


 ఏలూరు జిల్లా ఏలూరు: సమానత్వం, ప్రాధమిక హక్కులు, పేదరికం, పర్యావరణం, జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందనిజిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.  ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉత్తమ పనితీరును కనపరచిన డాక్టర్లకు, ఎఎన్ఎం, ఆశా వర్కర్లకు, లక్కీడిప్ ద్వారా కుటుంబ నియంత్రణ పాటించిన వారికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రశంసా పత్రాలు, చెక్కులను అందజేశారు. 



ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జనాభా పెరుగుదలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని, మరి ముఖ్యంగా వైద్యులు శాశ్వత, తాత్కాలిక పద్దతులు (కుటుంబ నియంత్రణ) ప్రజలు అవలంబించేలా ప్రోత్సహించాలని ఇందుకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ హితువు పలికారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం కుటుంబ నియంత్రణ పద్దతులను అవలంబించిన దంపతులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన వారికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా చెక్కును, సర్టిఫికెట్ ను అందజేశారు.  అలాగే కుటుంబనియంత్రణలో విశేష సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి నగదు బహుమతులు అందించడం జరిగింది. 


ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. డి. ఆశ, డిపిఎం డాక్టర్ జోషిరాం, ప్రోత్సహాలు అందుకున్న గైనకాల జిస్ట్ లు డా. నరేంధ్ర సింగ్, డా. కె. అనూష , సిఎఎస్ డా. పి. బాలప్రకాశరావు ఆర్ఎంఎన్ సిహెచ్ కౌన్సిలర్ వి. భరత్ కుమార్, ఎఎన్ఎంలు ఎస్ కె. జరీనా, కె. వరలక్ష్మీ, ఆశా వర్కర్లు జి. దుర్గాదేవి, వి. కమల, లక్కీడిప్ కపిల్ జి. లక్ష్మణమ్మ, డి. రామోజీ, ఇ. రామయ్య, పి. రేవతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.