Hot Posts

6/recent/ticker-posts

పాడి రైతులకు ఉత్తమ సేవలు అందించడంలో ఏలూరు జిల్లాకు రాష్ట్రంలో నాలుగో స్థానం


ఏలూరు: ఏలూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో రెండవ స్థానము మరియు గుడ్ల ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందని  పశు సంవర్దక శాఖ జేడీ డా .జి.నెహ్రూ బాబు తెలిపారు. సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పశు సంవర్దక శాఖ ప్రగతిని వివరిస్తూ జిల్లాలో 11 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 66 వెటర్నరీ డిస్పెన్సరీలు మరియు 57 గ్రామీణ పశు వైద్యశాలలు 537 ఆర్బీకేలులతో పాడి రైతులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఏలూరు జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందన్నారు.

ఏలూరు జిల్లాలోని ప్రతి వైద్యశాలకు వైద్యశాల స్థాయిని బట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి 50వేల నుండి లక్ష రూపాయల వరకు స్థానిక అవసరాల ప్రకారం మందులను మెడిసిన్ మేనేజ్మెంట్ సిస్టం(ఎం ఎం ఎస్) విదానం సంబంధిత పశు వైద్యులు ఇండెంట్ పెట్టిన మందులను హాస్పిటల్ కు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఆర్ బి కె కు నెలకు 5,000 చొప్పున ఒక సంవత్సరానికి సరిపడా మందులను ప్రతి ఆర్.బి.కేకు అందించడం జరిగిందన్నారు. కావున జిల్లాలో ప్రతి వైద్యశాలలో మందులకు ఇబ్బందిలేదన్నారు.

జిల్లాలో ఆర్ బి కె ల ద్వారా రైతులకు ఉపయోగపడే విధముగా దాణా పశుగ్రాస విత్తనాలు మరియు గడ్డి కత్తిరించు యంత్రాలను సబ్సిడీ ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరుకు జిల్లాలో 2929 మెట్రిక్ టన్నుల టి యం అర్ (సంపూర్ణ సమీకృత దాణా)ను 60 శాతం సబ్సిడీతో 5052 మంది రైతులకు అందించడం జరిగినది మరియు 213 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను 6110 రైతులకు 75% సబ్సిడీతో అందించడం జరిగిందన్నారు. 128 గడ్డి కత్తిరించు యంత్రాలను 40 శాతం సన్సీడీతో జిల్లాలో రైతులకు అందించడం జరిగిందన్నారు. 2022-24 సంవత్సరానికిగాను జిల్లలోని 17,62,512 పశువులకు చికిత్స అందించారన్నారు, 18,23,797 పశువులకు నట్టల నివారణ మందులు త్రాగించడం, 34,03,932 పశువులకు రోగ నిరోధక టీకాలువేశారన్నారు.

జగనన్న పాలవెల్లువ ద్వారా మహిళా పాడి రైతులకు మెరుగైన పాలధరను మరియు పాడి రైతుల ఆదాయాన్ని పెంచుటకు ప్రభుత్వము వారు జిల్లాలో అమూల్ డైరీ ద్వారా పాల సేకరణ జరుగుతున్నదన్నారు. జిల్లాలో మొదటి దశలో 12 మండలాలలోని 20 రూట్ల ద్వారా 142 గ్రామాలలో ప్రారంభించబడి రోజుకు 18,000 లీటర్ల పాల సేకరణ జరుగుచున్నదన్నారు. జిల్లాలో 7 నియోజవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగ శాలలు మంజూరు చేయబడ్డయన్నరు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని పశువులకు అత్యవసర పశు వైద్య సేవలు అందించుటకు అసెంబ్లీ నియోజక వర్గానికి రెండు చొప్పున సంచార పశు వైద్య శాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 24x7 ప్రాతిపదికన పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1962 కి పశువుల యజమానులు/రైతులు కాల్ చేసి సేవలను పొందవచ్చున్నారు.

పాడి రైతులు మరియు గొర్రెలు మేకలు పెంచకదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ పశు బీమా పథకం ప్రవేశపెట్టిందన్నారు. గతంలో ఉన్న వైయస్ఆర్ పశు నష్టపరిహార పథకం స్థానంలో దీన్ని అమలు చేస్తున్నారన్నారు. పాడి పశువులు చనిపోతే కలిగే నష్టం నుండి పాడిరైతులకు మరియు పశువుల పెంపకదారులకు రక్షణ కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ భీమా పథకంలో గరిష్ఠంగా ఒక్కో కుటుంబానికి 5 గేదలు 50 గొర్రెలు లేదా మేకలను భీమా లో నమోదు చేసుకొనడానికి అవకాశం ఉందన్నారు. రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులు తమ వాటా కింద 20% రేషన్ కార్డు లేని వారు 50% ప్రీమియం చెల్లిస్తే వైఎస్ఆర్ పశు బీమా పథకానికి అర్హత పొందుతారన్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే పశువులు గేదలకు మూడేళ్లు పాటు బీమా పథకం వర్తిస్తుందన్నారు.