ఏలూరు జిల్లా, టీ నర్సాపురం: మండలంలోని బొరంపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల సూర్యరావు శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. మరొకరికి చూపునిచ్చేందుకు సూర్యరావు నేత్రాలను దానం ఇచ్చేందుకు భార్య వీరమ్మ, కుమారులు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు ఒప్పుకున్నారు.
దీంతో ఎల్బీ ప్రసాద్ ఆసుపత్రి వారు సూర్యారావు నేత్రాలను సేకరించారు. మృతి చెందిన ప్రతి ఒక్కరు నేత్రాలను దానం చేయటానికి ముందుకు రావాలని కోరారు. ఒకరు నేత్రదానం చేయడం ద్వారా 16 సంవత్సరాల లోపు నలుగురు అందులకు చూపును ఇచ్చే అవకాశం ఉంటుందని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యాలయం టెక్నీషియన్స్ సుధారాణి, హరికృష్ణ తెలిపారు.
నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన వీరమ్మ, వారి కుమారులను మండలంలో పలువురు అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు.
![]() |
నేత్రదాత వీరమల్ల సూర్యరావు |
Social Plugin