Hot Posts

6/recent/ticker-posts

రోజా విషయంలో జగన్ కీలక నిర్ణయం... ప్లేస్ ఫిక్స్!


 సిద్ధం" అంటూ భీమిలి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. ఇదే సమయంలో అభ్యర్దుల ఎంపికలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కీలక స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన జగన్... ఇక తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. 


వైసీపీ సిట్టింగు ఎంపీలలో మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, నందిగాం సురేష్ లను మాత్రమే కంటిన్యూ చేస్తున్న జగన్... మిగిలిన స్థానాల్లో కీలక మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులను ఎంపీ అభ్యర్థులుగా నియమిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట లోక్ సభ స్థానానికి మంత్రి అనిల్ కుమార్ యదవ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో లోక్ సభ స్థానానికి రోజా పేరు వినిపిస్తుంది. 


నరసరావుపేట లోక్ సభ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ ని జగన్ నియమించనున్నారని కథనాలొస్తున్న వేళ... ఒంగోలు లోక్ సభ స్థానానికి నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంగోలు లోక్ సభ స్థానానికి రోజాను ఎంపిక చేస్తే స్వాగతించడానికి జిల్లా నేతలు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. దీంతో... రోజా పేరు ఆల్ మోస్ట్ కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 


వాస్తవానికి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి ఇచ్చిన వేళ.. భాస్కర రెడ్డిని ఎంపీగా పంపాలని ప్రయత్నాలు జరిగాయని కథనాలొచ్చాయి. అయితే ఈ విషయంపై జిల్లా నేతల నుంచి సానుకూల కనపించ లేదని అంటున్నారు. దీంతో... మంత్రి రోజా పేరు తెర మీదకు వచ్చింది! ఈ విషయంలో మంత్రి రోజా తోనూ వైసీపీ పెద్దలు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరున్న రోజా... జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారని చెబుతున్నారు. దీంతో.. నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యదవ్, ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్ల ఖరారు పైన సీఎం జగన్ సోమవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది.