Hot Posts

6/recent/ticker-posts

ఏపీ ఎన్నికల వేళ బాబుని టార్గెట్ చేసిన కేసీఆర్...!


ఆ పార్టీని ఎటూ విమర్శిస్తారు కానీ మధ్యలో చంద్రబాబు ఎందుకు వచ్చారు అంటే అదే కేసీఆర్ రాజకీయ మ్యాజిక్ అనుకోవాలేమో. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సడెన్ గా చంద్రబాబు మీద పడ్డారు. ఆయనకు అక్కడ కాంగ్రెస్ ప్రత్యర్థి. ఆ పార్టీని ఎటూ విమర్శిస్తారు కానీ మధ్యలో చంద్రబాబు ఎందుకు వచ్చారు అంటే అదే కేసీఆర్ రాజకీయ మ్యాజిక్ అనుకోవాలేమో. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు కేసీఆర్. అలా ఒక్కసారి కేసీఅర్ పాతికేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లిపోయారు. ఆనాడు ఉమ్మడి ఏపీకి సీఎం గా చంద్రబాబు ఉన్నారని, భూదాన్ పోచంపల్లిలో ఒకేరోజున ఏడుగురు నేతన్నలు ఆత్మ హత్య చేసుకున్నారు అని చెప్పారు. 


ఆ రోజున బాబుకు దండం పెట్టి ఒక్కో నేతన్న కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇవ్వమని కోరాను అని కేసీఆర్ చెప్పారు. అయితే మూర్ఖుడు దుర్మార్గుడు అయిన చంద్రబాబు అసలు వినిపించుకోలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. తాను మాత్రం బిక్షాటన చేసి ఏడున్నర లక్షలు కలెక్ట్ చేసి ఆయా కుటుంబాలకు ఇచ్చాను అని చెప్పారు. అంతే కాదు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేనేతల కుటుంబాలకు ఎన్నో పధకాలను తన హయాంలో అమలు చేశాను అని కేసీఆర్ చెప్పారు. సరే కేసీఆర్ తన ప్రభుత్వం గురించి చెప్పవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయవచ్చు. 

మధ్యలో చంద్రబాబు ఎందుకు వచ్చారు అన్నదే ప్రశ్న. అయితే తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం పోటీ చేయలేదు. టీడీపీ ఓట్లు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి పడేలా వ్యూహరచన చేశారు అని ప్రచారంలో ఉంది. అది ఒక కారణంగా కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్నది కూడా కేసీఅర్ కి ఉంది అంటున్నారు. దాంతో పాటు ఏపీలో ఇపుడు ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబు బీసీల పట్ల నేతన్నల పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది చెప్పడం ద్వారా సరైన టైం లో ఆయన అవకాశాలను దెబ్బతీయాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు. 

ఏపీలో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణాలో రేవంత్ రెడ్డికి అది మరింత బలం అవుతుంది. దాంతో పాటు తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు ప్రస్తావన అవసరం లేకపోయినా ఆయన తెచ్చారా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే కేసేఅర్ నోట ఎపుడూ చంద్రబాబు ప్రస్తావన రాదు. చాలా కాలానికి ఆయన బాబుని విమర్శించారు. అది కూడా మూర్ఖుడు దుర్మార్గుడు అని తీవ్ర పదజాలం ఉపయోగించారు అంటే ఏపీలో కచ్చితంగా బాబు ఓటమి పాలు కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు అన్నది అర్థం అవుతోంది. మొత్తం మీద చూస్తే సరైన టైం లోనే కేసీఅర్ బాబుని టార్గెట్ చేశారు అని అంటున్నారు. దీనికి టీడీపీ నుంచి ఏ విధంగా కౌంటర్ వస్తుందో చూడాల్సి ఉంది.