Hot Posts

6/recent/ticker-posts

‘5 కె రెడ్ రన్’ ను ప్రారంభించిన ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్


 ఏలూరు: హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై ప్రజల్లో మరింత అవగాహన కలిగించేందుకు 5 కె రెడ్ రన్’ ను నిర్వహించినట్లు ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్ చెప్పారు.  ‘నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్,  రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ  ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరు వారి పర్యవేక్షణలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ,  నివారణా విభాగం ఆధ్వర్యంలో గురువారం స్ధానిక ఇండోర్ స్టేడియం నుంచి "నేషనల్ యూత్ ఫెస్ట్ -2023” కార్యక్రమంలో భాగంగా ‘5 కె రెడ్ రన్’ (5కి.మీ. పరుగు) కార్యక్రమాన్ని ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు.  ఈ మారథాన్ (5 కి.మీ. పరుగు) లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం , దుంపగడప, పాలకొల్లు ప్రాంతాలలో గల రెడ్ రిబ్బన్ క్లబ్స్ కలిగిన డిగ్రీ కళాశాలల నుండి 60 విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు.



జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టి.బి. కంట్రోల్ జిల్లా ప్రగ్రాం ఆఫీసర్ డా. జి. రత్నకుమారి  మాట్లాడుతూ ఈ 5 కె రెడ్ రన్ లో ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న వారిలో స్థానిక సర్ సి.ఆర్.రెడ్డి కళాశాలకు చెందిన బి. మోహన్ మరియు పి.సాయి రామ్ లు మొదటి, ద్వితీయ స్థానాలు గెలుపొందగా, ఏలూరు కోటదిబ్బ డిగ్రీ కళాశాల విద్యార్థి పి. సాయికుమార్ తృతీయ స్థానం సాధించారన్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాల్గొన్న వారిలో తణుకు డిగ్రీ కళాశాల విద్యార్థులు యేసు సత్య మరియు హిమేష్ కుమార్లు మొదటి మరియు తృతీయ స్థానాలను కైవశం చేసుకోగా, తాడేపల్లిగూడెం పెంటపాడు డిగ్రీ కళాశాల విద్యార్థి మోహన్ కుమార్ ద్వితీయ స్థానాన్ని సాధించారన్నారు.  వీరితో పాటు సర్ సి.ఆర్.రెడ్డి కలశాల, ఏలూరు కోటదిబ్బ డిగ్రీ కళాశాల, జంగారెడ్డి గూడెం డిగ్రీ కళాశాల, తణుకు డిగ్రీ కళాశాల, తాడేపల్లిగూడెం పెంటపాడు డిగ్రీ కళాశాల మరియు పాలకొల్లు డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు కన్సొలేషన్ బహుమతులు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు ప్రతి జిల్లా నుంచి ప్రథమ బహుమతి క్రింద రూ. 10,000, ద్వితీయ బహుమతి క్రింద రూ. 7,000 మరియు తృతీయ బహుమతి క్రింద రూ. 5,000 నగదు పారితోషికాన్ని సెప్టెంబర్ నెల రెండవ వారంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో అందజేయడం జరుగుతుందన్నారు.  దీనితోపాటు ఈ విజేతలను తదుపరి రాష్ట్రస్థాయిలో జరుగు పోటీలకు పంపించడం కూడా జరుగుతుందన్నారు. వీరితోపాటు ప్రతి జిల్లా నుంచి మరో 7  మందికి కన్సొలేషన్ క్రింద రూ. 1,000 చొప్పున నగదు బహుమతి అందజేయడం జరుగుతుందన్నారు.



ఈ కార్యక్రమంలోడిస్ట్రిక్ట్ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా. నాగేశ్వర రావు, జిల్లా నెహ్రు యువకేంద్రం కోఆర్డినేటర్ డి. కిషోర్, జిల్లా ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ కుసుమ కుమారి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్లు,ఎన్.సి.సి. కోఆర్డినేటర్లు, రెడ్ రిబ్బన్ క్లబ్స్ కోఆర్డినేటర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.