Hot Posts

6/recent/ticker-posts

తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు.. అలంటి ఇలాంటి రికార్డు కాదు


 తెలుగు రాష్ట్రాల్లో మద్యం మీద భారీగానే ఆదాయం వస్తుంది. దీంతో మద్య నిషేధం మాట పాలకులు మరిచేపోయారు. పలు రకాల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చి ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. డిసెంబర్ నెలలో మద్యం ప్రియులు ఎక్కువగా తాగారు. రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం గమనార్హం. నూతన సంవత్సర వేళ నిన్న ఒక్క రోజే రూ.172 కోట్ల మద్యం అమ్ముడవడం ఆశ్చర్యకరం. ఈనేపథ్యంలో మద్యం అమ్మకాలు ఇంత భారీగా చోటుచేసుకోవడం విశేషం. 1.76 లక్షల కేసులు లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.42.26 కోట్లు, వరంగల్ జిల్లాలో 24.78 కోట్లు, హైదరాబాద్ లో రూ.23.13 కోట్లు మద్యం విక్రయం జరిగింది. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.3,459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ లో 40 లక్షల కేసుల లిక్కర్, 34 లక్షల బీర్లు తాగారు. మొత్తంగా తెలంగాణలో 2021లో 30,222 కోట్ల మద్యం విక్రయాలు నమోదు కావడం తెలిసిందే. 

ఏపీలోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. నిన్న ఒక్క రోజే రూ.124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిపారు. మద్యం దుకాణాల నిర్వహణ సమయం గంటపాటు పొడిగించడంతో విక్రయాలు భారీగా నమోదయ్యాయి. బార్లు రాత్రి అధిక సమయం తెరిచి ఉంచడంతో మద్యం ప్రియులు అధికంగా తాగినట్లు తెలుస్తోంది. 1,36,124 కేసుల మద్యం, 53,482 కేసుల బీర్లు తాగినట్లు అబ్కారీ శాఖ తెలియజేసంది. ఇలా మద్యం విక్రయాలు పెరగడంతో సర్కారుకు భారీగానే ఆదాయం సమకూరింది. 

తెలుగు రాష్ట్రాల్లో మద్యం మీద భారీగానే ఆదాయం వస్తుంది. దీంతో మద్య నిషేధం మాట పాలకులు మరిచేపోయారు. పలు రకాల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చి ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ మనుగడలో మద్యమే ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. ఈ క్రమంలో మద్యం ప్రియులు ప్రభుత్వ నిర్వహణలో బాసటగానే నిలుస్తున్నారనే వాదనలు కూడా రావడం సహజం. మద్యం విక్రయాలు డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎవడి పెళ్లి పెటాకులైతే ఏంటి పట్టెడు పప్పన్నం దొరకడమే కావాలి అన్నట్లు జీవితాలు శిథిలం అవుతున్నా ప్రభుత్వాలకు మాత్రం ఏ ఢోకా లేకుండా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లడం విశేషం.