గద్వాల: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు కోరారు. శనివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు గిరిబాబు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఇతర జిల్లాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, గానీ, జిల్లాలో మాత్రం స్థలాలు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముకుందరావు, వెంకట్రావు, సుధాకర్, రామాంజనేయులు, రామన్‌గౌడ్ పాల్గొన్నారు.
Social Plugin