ఇదే గుంటూరు జిల్లాకు 2015లో వచ్చిన నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ అగ్రనాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీని ఏపీకి తీసుకురావాలని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుంటూరును వేదికగా మార్చారు. ఇక, తేదీపై తర్జన భర్జన ఉన్నా.. మోడీ రాకమాత్రం ఖాయమనే ప్రచా రం జరుగుతోంది. అయితే. మోడీ వస్తారు.. బాగానే ఉంది ఏం చెబుతారు? అనేది ఆసక్తిగామారింది. అసలు కీలక ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇస్తారు? అనేది కూడా చర్చకు దారితీస్తోంది.
ఎందుకంటే.. ఇదే గుంటూరు జిల్లాకు 2015లో వచ్చిన నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత.. ఇక, దీని గురించి పట్టించుకోలేదు. రైతులు ఉద్యమాలు చేసి, రాజధాని కోసం ప్రధా ని మోడీకి లేఖలు రాసినప్పుడు కూడా ఆయన ఏమాత్రం స్పందించలేదు. దీంతో ప్రధానిపై రాజధాని వాసులకు కొంత వరకు ఆవేదన ఉంది. ఇక, ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఆయన మరిచిపోయారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన వచ్చి ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
మరీముఖ్యంగా వేదికను ఎంచుకునే విషయంలోనే పొరపాటు జరిగిందా అనేది కూడా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే.. ఇదే గుంటూరు జిల్లాకు వచ్చి రాజధానికి శంకు స్థాపన కూడా చేసిన ప్రధాని.. తర్వాత కాలంలో మరిచిపోయారు. ఇప్పుడు ఆయనను నేరుగా గుంటూరుకు తెస్తే.. గత జ్ఞాపకాలను ఏరి కోరి ప్రజలకు గుర్తు చేసినట్టు అవుతుందనేది పరిశీలకుల అంచనాగా ఉంది. అందుకే.. వేదికను వేరే చోటకు మార్చాలేదని మూడు పార్టీల్లోనూ జరుగుతున్న చర్చ.
అయితే.. ఎక్కడకు వెళ్లినా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు.. అమలు చేయని పరిస్థితులు కళ్లకు కడుతు న్నాయి. తిరుపతిలో సభ పెడితే. ప్రత్యేక హోదాపై ఇక్కడే హామీ ఇచ్చారు. తాము వచ్చాక అమలు చేస్తా మని చెప్పారు. కానీ, దీనిని అటకెక్కించారు. పోనీ.. విశాఖకు వెళ్లి.. అక్కడ సభ పెడదామంటే.. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్న వ్యవహారం ఇంకా రగులుతూనే ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. ప్రధాని రాక వరకు బాగానే ఉన్నా.. దారి తర్వాత అది మేలు చేయడం అనేది చంద్రబాబు అనుసరించే విధానాన్ని బట్టే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
Social Plugin