Hot Posts

6/recent/ticker-posts

జనసేన గురించి కిషన్ రెడ్డి ఏమనుకుంటున్నట్లు?


 ఈ సమయంలో ఏపీ ఎన్నికలకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకూ సమయం దగ్గరపడుతున్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతకొంతకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పలు పార్టీల పొత్తుల వ్యవహారాలు మొత్తం రాజకీయాలనే భ్రష్టుపట్టిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏపీలో టీడీపీ - జనసేన కలిసి పోటీచేయబోతున్నాయని చెబుతుండగా... గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అస్త్ర సన్యాసం చేసింది. ఈ సమయంలో ఏపీ ఎన్నికలకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకూ సమయం దగ్గరపడుతున్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ చేస్తున్న రాజకీయాలపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేయగా... పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది బీజేపీ. అయితే ఆ ఎనిమిది స్థానాల్లోనూ జనసేనకు డిపాజిట్లు రాలేదు! దీంతో... జనసేనతో పొత్తును అంగీకరించినవారిపై మిగతా నేతలు ఫైరవ్వడం.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పెద్దలకు హితబోద చేయడం జరిగిందనే చర్చ నడిచింది. 


ఈ నేపథ్యంలో... సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు.. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మరోపక్క ఏపీలో జనసేన బీజేపీతో పొత్తులోనే ఉందని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చారు. దీంతో... జనసేనతో అటు ఏపీ బీజేపీ, ఇటు తెలంగాణ బీజేపీ ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జనసేనతో పొత్తు విషయంపై కిషన్ రెడ్డి స్పందించారు. మరోమారు కలిసి పోటీచేసే విషయాన్ని తేల్చి చెప్పారు. 


తాజాగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై స్పందించిన కిషన్ రెడ్డి... ఆ సందర్భంగా రాబోయే లోక్ సభ ఎన్నికలపైనా స్పందించారు. ఇందులో భాగంగా... వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో... జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని చెప్పడం గమనార్హం. 


ఈ సందర్భంగా పొత్తు విషయాలపై మరిన్ని వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి... ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని అన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉందని.. ఈ సందర్భంగా కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఇదే క్రమంలో... సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే చర్చ కూడా జరగలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో... ఎంపీ టికెట్లలో మహిళలకు, బీసీలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పిన కిషన్ రెడ్డి... పార్లమెంట్ ఎన్నికల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.