Hot Posts

6/recent/ticker-posts

స్థాయి సంఘ సమావేశాలకు హాజరుకాని జిల్లా అధికారులపై చర్యలకు సిఫారసు: జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ


ఏలూరు: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించే జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావలసిందేనని, హాజరుకానివారిపై శాఖాపరమైన చర్యలకు సంబంధిత శాఖల రాష్ట్రాధిపతులకు సిఫారసు చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ హెచ్చరించారు. ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కొందరు జిల్లా స్థాయి అధికారులు ముందస్తు అనుమతి తీసుకోకుండా సమావేశానికి  హాజరు కాకుండా తమ కింద స్థాయి అధికారులను పంపడంపై పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ స్థాయి సంఘ సమావేశంలో గృహనిర్మాణ శాఖ సమీక్షలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి హాజరు కాకపోవడం, అదేవిధంగా 4వ స్థాయి సంఘ సమీక్షలో పశ్చిమ గోదావరి జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా పరిషత్ సమావేశాలకు తప్పనిసరిగా జిల్లా స్థాయి అధికారులు హాజరు కావలసిందేనని, హాజరు కానివారు శాఖాపరమైన చర్యలకు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.  

          

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. రవికుమార్, జెడ్పి  వైస్ చైర్ పర్సన్ లు శ్రీలేఖ, విజయబాబు, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై. రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.