ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి: బగుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తన ప్రాణాలే అర్పించింన మహోన్నత స్వర్గీయులు వంగవీటి మోహన్ రంగా జయంతి పురస్కరించుకుని గడ్డమణుగు రవికుమార్, Ex-జడ్పీటీసి, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కాపు నాయకులు, కాపు యువత జీలుగుమిల్లిలో రంగా విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. అన్ని వర్గాలను కలుపుకుని ప్రజలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయ్యకుండా పోరాడిన రంగా సూర్త్ఫి, ఆయన 40 ఏళ్ల జీవితం 40 తరాలకు ఆదర్శమన్నారు. అక్కడి నుండి బైక్ ర్యాలీగా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది.
అదేవిధంగా మ కొద్దీ కోజుల క్రితం రోడ్ ప్రమాదం జరిగి ఇబ్బంది పడతున్న జీలుగుమిల్లిలోని గంగుల గంగారత్నం ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకుని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని మీకు అందుబాటులో మేము అందరం ఉన్నామని హామీ ఇచ్చి ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురిశెట్టి ఏసుబాబు, గంగుల రమేష్, సురిశెట్టి మహేష్, వంకాయల నాగేశ్వరావు, సురిశెట్టి శ్రీను, కోలా మధు, కోర్ల సత్యనారాయణ, రూపా సత్యనారాయణ, శేఖర్, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
👇
Bulk channels available in *BCN OTT*
app Download link:
Social Plugin