ఏలూరు జిల్లా ఏలూరు: ఉపాధి కల్పనా కార్యాలయము, నేషనల్ కెరీర్ సర్వీసు (ఎస్.సి.యస్.) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సెట్ వెల్, ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యములో ది.07.07.2023 తేదిన ఉదయం 10.30 గం. కు సెట్ వెల్ కార్యాలయము, కలక్టరేట్ కాంపౌండ్, ఏలూరు నందు జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు మరియు సెట్ వెల్ ముఖ్యకార్యనిర్వాహాణాధికారి యం.డి.హెచ్ మెహరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాకు ఇంటర్వ్యూలు నిర్వహించుటకు ఈ దిగువ తెల్పిన కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
1. సి.యం.ఆర్. జూవలరీ:
ఉద్యోగము: మార్కెటింగ్,
ఖాళీలు: 20, పురుష అభ్యర్ధులు,
విద్యార్హత: ఇంటర్ ఆపైన,
వయస్సు: 18 - 35,
వర్కు లొకేషన్: ఏలూరు,
జీతం: రూ.13,000/--
2. మోహన్ స్పిన్ టెక్స్ :
ఉద్యోగము: ఖాళీలు: స్త్రీ- 60,
వీవింగ్ ఆపరేటర్స్, సూయింగ్ ఆపరేటర్స్, హెల్పరులు..
పు-20 గార్డ్స్,
ఐ.టి.ఐ.ఫిట్టర్స్, ఎలక్ట్రిషియన్స్,
విద్యార్హతలు : 8వ తరగతి నుండి డిగ్రీ,
వయస్సు 18-35 సం.లు.,
వర్కు లొకేషన్ : మల్లవల్లి, హనుమాన్ జంక్షన్ దగ్గర.
జీతం: రూ.8,000/- -రూ.12,000/-
యువతకు ప్రభుత్వము కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరముల కొరకు జి. ప్రవీన్ కృష్ణ. నేషనల్ కెరీర్ సర్వీసు (ఎస్.సి.యస్.) జిల్లా కోఆర్డినేటర్, ఏలూరు వారి నెంబర్ 9494490990 ను సంప్రదించవలసినదిగా సెట్ వెల్ ముఖ్యకార్యనిర్వాహన అధికారి యం.డి. హెచ్ మెహరాజ్ తెలియజేశారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.BCN OTT
Social Plugin