Hot Posts

6/recent/ticker-posts

వైసీపీలో 18 ప్లస్ 45... 63 ఈ బిగ్ నంబర్...? అంటే..!


వైసీపీలో కొత్తగా కొంతమంది ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. అసలు ఈ నంబర్ వలనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జగన్ వర్క్ షాప్ చేయడం.. అంటే ఒక నంబర్ అయితే బయటకు రావడం దాని మీద చర్చలు పెద్ద ఎత్తున సాగడం జరుగుతూ ఉంటాయి. గత ఏడాది నుంచి చూస్తే జగన్ ఇప్పటికి సుమారు అయిదు సార్లు ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ పెట్టారు. పెట్టిన ప్రతీ సారి పాతిక ముప్పయి మందికి తక్కువ లేకుండా ఎమ్మెల్యే పనితీరు బాగోలేదన్న విషయం అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన వర్క్ షాప్ లో చూస్తే ఏకంగా బిగ్ నంబరే వైసీపీలో ఉందని లీక్స్ వస్తున్నాయి. ఇందులో కూడా రెండు కేటగిరీలు ఉన్నాయి. తొలి కేటగిరీలో చూస్తే 18 మంది ఎమ్మెల్యేల ఉన్నారు..


వీరు వారి నియోజకవర్గంలోని గ్రామంలో గడప గడపకు వెళ్ళడం లేదని, ఆ విషయంలో వీరి మీద రెడ్ సిగ్నల్ పడిందని తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రులు సీనియర్ నేతలూ ఉన్నారని వినిపిస్తున్నాయి. వీరిలో గెలిచే వారూ కూడా ఉన్నారు. కానీ జగన్ చెప్పినట్లుగా గడప గడపకు వెళ్ళడం లేదని, వీరి పనితీరును అంచనా కట్టి తొలి జాబితాలో పెట్టారని తెలుస్తోంది.


అదే విధంగా చూస్తే రెండవ కేటగిరీలో ఏకంగా నలభై అయిదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. వీరు వారి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి గడప గడపకూ తిరుగుతున్నారు. కానీ వీరికి గెలుపు అవకాశాలు తక్కువని, పనితీరు బాగోలేదని ప్రజలలో వ్యతిరేకత ఉందని నివేదికలు సిఎం వద్ద ఉన్నాయని తెలుస్తోంది.  ఇలా మొత్తాన్ని తీసుకుంటే 18 ప్లస్ 45 కలిపితే 63 మంది ఎమ్మెల్యేలు అన్న మాట. ఇదే అతి పెద్ద నంబర్. దీని మీదనే వైసీపీలో వేడి వేడిగా ట్రాఫిక్ నడుస్తుందని సమాచారం.


ఈ బిగ్ నంబర్ విషయానికి వస్తే మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో గతంలో నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ చేశారు. వారిని మినహాయిస్తే 146 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 63  చాలా కీలకమైన అంకెగానే చూడాలని కొందరు అంటున్నారు. ఈ మొత్తం 63 మందికి అక్టోబర్ నెల ఆఖరు వరకు సమయం ఇచ్చారని అంటున్నారు. అప్పటికి కూడా వారి పనితీరు మార్చుకోలేకపోతే మళ్లీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేమని అధినాయకత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.


ఇంకా ఎన్నికలు ఏడాదిలో ఏపీ రానున్నాయి. సమయం చాలా తక్కువగా ఉంది. అక్టోబర్ అంటే ఇంకా నాలుగు నెలలు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో పనితీరు మెరుగుపడుతుందని ఎవరైనా అనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది. అదే జరిగితే అద్భుతమే అవుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరి పనితీరు మెరుగుపడకపోతే ఏమి చేస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా పలువురులో పెరుగుతుంది. నిజంగా ఇంత మందికీ టికెట్లు దక్కవా అన్నదే ఇపుడు పార్టీలో వస్తున్న కొందరిలో అనుమానాలు. ఇంత భారీ సంఖ్యలో టికెట్లు తొలగిస్తే మాత్రం అది వైసీపీలో అతి పెద్ద సంక్షోభమే ఏర్పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలుపు సంగతి తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదని వారిని తొలగిస్తే.. వారి నుంచి అసమ్మతి రాజుకుని అసలుకే ఎసరు పెడుతుందని కొందరు అంటున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం వైసీపీ హై కమాండ్ దగ్గర ఏ రకమైన వ్యూహం ఉందో వేచి చూడాల్సి ఉంది. ఇటీవల కర్నాటకలో చూస్తే పెద్ద ఎత్తున సిట్టింగులకు టికెట్లు బీజేపీ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారే వేరే పార్టీలోకి వెళ్ళి బీజేపీ గెలుపు అవకాశాలను దెబ్బ తీశారు.. దాని ఫలితంగా భారీ ఓటమి దక్కింది. అందువల్ల అంత పెద్ద సంఖ్యలో సిటింగ్ ఎమ్మెల్యే టికెట్లను తొలగిస్తే వైసిపి భారీ రిస్క్ చేయవలసి వస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇపుడు అది హాట్ ట్రాఫిక్ గా ఉంది.

ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.

BCN OTT
app Download link 
BCN TV LIVE link 

SANA TV LIVE link 
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link