జిల్లా లో ఆధార్ డాక్యుమెంటేషన్ అప్ డేట్ చేసుకోవలసిన వారు 3 లక్షల 30 వేల మంది ఉన్నారని వారందరూ గ్రామ, వార్డ్ సచివాలయం శాఖ ద్వారా ప్రతీ మండలం / మునిసిపాలిటీ నందు ఏర్పాటు చేసిన 80 ఆధార్ సేవా కేంద్రం ద్వారా త్వరితగతిన చేసుకోవాలన్నారు. ఏడు సంవత్సరాలు పూర్తి అయిన పిల్లలు , 17 సంవత్సరాలు నిండిన పిల్లలు అందరు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని యండియు వాహనాలు, మొబైల్ మైక్ ద్వారా ప్రచారం చేయాలన్నారు. పుట్టిన పిల్లలందరికీ సంబంధిత హాస్పిటల్ వద్దనే ఆధార్ చేయుటకు సిఇఎల్ సి ( Child Enrolment Light Client ) ద్వారా చేసుకోవాలన్నారు. సచివాలయం లోని వాలంటీర్స్ అందరు తమ పరిధిలోని హౌస్ హోల్డర్ అందరికి ఆధార్ అప్డేషన్ గురించి తెలియజేయాలన్నారు. జిల్లాలో ఎఎస్ కె సెంటర్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ఆధార్ సర్వీసులందు జిల్లాలో అత్యుత్తమ సేవలు చేసినందుకు గాను ముసునూరు -2 సచివాలయం వాలంటీరు గొల్లమందల వినయ మనోజ్ఞ, పోలవరం-2 కి చెందిన జల్లిపల్లి తేజ, లింగపాలెం కు చెందిన రవి శంకర్, కోరుకొల్లు-2 కి చెందిన సతీష్, తిరుమలదేవిపేటకు చెందిన చందు లను డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి అభినందించారు.
సమావేశంలో డిసిహెచ్ ఎస్ డా. ఎవిఆర్ మోహన్, కమిటీ కన్వినర్ & నోడల్ ఆఫీసర్ గ్రామ వార్డ్ సచివాలయం శాఖ జి.రమణ , యుఐడిఎఐ ప్రతినిది వర ప్రసాద్, డిఎంహెచ్ఓ డా. డి. ఆశ, జిఎస్ డబ్ల్యూఎస్ ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ పి.రవి , తదితరులు పాల్గొన్నారు.
Social Plugin