ఆలయకమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) మాట్లాడుతూ అమ్మ వారి దివ్య అనుగ్రహముతో ఆలయంలోని ప్రతీ ఆధ్యాత్మిక సేవ భక్తులకు అందుబాటులో ఏర్పాటుచేయడం జరిగిందని అందులో భాగంగానే పౌర్ణమి సాయంత్రం చండీహోమం నిర్వహిస్తూ ఈరోజుతో 50 చండీహోమాలు ఆలయంలో పూర్తయ్యాయని,అందరికీ మంచి జరగాలని లోకకళ్యాణార్ధం సంకల్పం చేశామని అన్నారు.
ఆలయ ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్ శర్మ ముందుగా ఆలయ మండపంలో విగ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, మంటపారాధన, అమ్మవారికి షోడశోపచారాలతో పూజను నిర్వహించిన అనంతరం ఉభయదారులు చిన్ని రామ సత్యనారాయణ(సి.హెచ్.ఆర్), జయలక్ష్మి, దోమ్మేటి లక్ష్మీ జనార్ధనరావు, కుసుమ కుమారి (కొమ్ముగుడేం) తడికమళ్ళ దుర్గారావు, నాగజ్యోతి, డా: భద్రి వీరశేఖర్, లక్ష్మీదేవి (నల్లజర్ల) నడిపల్లి జ్యోతి, వంశీ కృష్ణ,
జన్ను పవన్ కుమార్, హైమావతి, మరియు యడవెల్లి పద్మజ (టీ.పీ.జి.)దంపతులచే ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా 50వ చండీహోమం నిర్వహించారు.
ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి తిప్పాభట్ల రామకృష్ణ 50వ చండీహోమం విశిష్టత, నూకాలమ్మ అనుగ్రహం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రసంగం అందించారు. హరే శ్రీనివాస శ్రీఅభయాంజనేయ కోలాట భజన బృందం కోలాటం నిర్వహించగా,శ్రీనూకాంబికా మహిళా భక్త సేవా సమితి ప్రతినిధులు పాలపొంగళ్లు నిర్వహించారు.
పట్టణ ప్రముఖులు, మహిళలు, రైతులు,ఉద్యోగులు, విద్యార్థులు యువకులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ అమ్మ వారి ఆలయ కమిటీ సభ్యులు, శ్రీనూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొని భక్తులకు యే విధమైన అసౌకర్యం కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Social Plugin