ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2022-23 రబీ సీజన్ లో సాగుచేసిన మొక్కజొన్నను రైతు భరోసా కేంద్రాల్లో మార్కెఫెడ్ ఆధ్వర్యాన కొనుగోళ్లు ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. మొక్కజొన్న విక్రయించాలనుకునే రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు పంట శాంపిల్స్ తీసుకువచ్చి నాణ్యతా ప్రమాణాలతో సరిచూచుకోవాలన్నారు. శాంపిల్స్ పరిశీలన, ఈ-క్రాప్, ఈ-కెవైసి నమోదైన రైతులను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు తమ తమ రైతు భరోసా కేంద్రాల వద్ద సంప్రదించాలన్నారు.
కావున రైతులందరూ మే, 12వ తేదీలోపు (12.05.2023) తమయొక్క పేర్లను నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ అవకాశాన్ని మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేసి కోరారు.
Social Plugin