Hot Posts

6/recent/ticker-posts

బాలల హక్కులు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం


 ఏలూరు: సమాజంలో బాలలందరూ సమగ్ర అభివృద్ధితో జీవనం సాగించడానికి బాలల హక్కుల చట్టం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి జి. రాజేశ్వరి తెలిపారు. గురవారం ఏలూరు కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికర సంస్ధ భవనంలో బాలల హక్కులు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తి పి. పురుషోత్తమ కుమార్ ఆదేశాలు మేరకు న్యా.య విజ్ఞాన సదస్తు మరియు న్యాయ సేవల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సదస్సులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి జి. రాజేశ్వరి మాట్లాడుతూ బాలల హక్కుల తీర్మానంలో జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు, ప్రధాన మైనవని తెలిపారు. జీవించే హక్కుద్వారా మన ఎదుగుదలకు కావల్సిన సంపూర్ణ ఆహారాన్ని పొందడం, మంచి వాతావరణం, కుటుంబ, వైద్య సదుపాయాలు, మొదలగు ప్రాధమిక అవసరాలు పొందడం అలాగే రక్షణ పొందే హక్కు కింద కుల, మత, లింగ, వివక్షలు, నిర్లక్ష్యం, దౌర్జన్యం, హింసాత్మక చర్యలనుండి కాపాడబడటం, ప్రకృతివైపరీత్యాలనుండి రక్షించడం తదితర హక్కుల గురించి అలాగే అభివృద్ధి చెందే హక్కు కింద బాలల స్వయం సంవృద్ధి కలిగి శాంతి సామరస్యాలతో తదితర అంశాలను, తదితర రక్షణ ఎప్పుడూ తోడుగా ఉండాలంటే తల్లిదండ్రులు, పెద్దలు బాల్యదశనుంచే అవకాశాలు అందజేయాలని తెలిపారు.


అలాగే పాల్గొనే హక్కుకింద బాలలు వారికి సంబంధిత అన్ని నిర్ణయాలలో భాగస్వాములు అవ్వడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.  బాధిత బాలలను ఆదుకొనేలాగా మీ నగరంలో ఉన్న చైల్డ్ లైన్ 1098 ఫోన్ చేయడం ద్వారా బాలలను ఆదుకొనేలా చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ బాల్యం నుంచే బాలలకు అందజేయవలసిన హక్కుల అవగాహన చేసుకొని తల్లిదండ్రులు వారి భవిష్యత్ ను తీర్చిదిద్దాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల సామరస్యంగా మంచి వాతావరణంలో పెంచగలిగితే వారు ఉన్నతశిఖరాలను అదిరోహిస్తారని తెలిపారు.  న్యాయపరమైన సేవలు గురించి ప్రతిఒక్కరికి ప్రతి అంశంపైనఅవగాహన కలిగించడానికే న్యాయసేవాధికార సంస్ధద్వారా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన పెంచుతున్నారని దీనిని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. 


 


ఈ కార్యక్రమంలో డిసిపివో సూర్యచక్రవేణి, సీనియర్ న్యాయవాది పి. కృష్ణారావు, రామ్మోహన్ రావు,ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విభన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ బాహలల హక్కులపై ప్రసంగించారు. ఈ కార్యక్రమ అనంతరం న్యాయశాఖ సేవలకు 
సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి జి. రాజేశ్వరి ప్రారంభించారు. అనంతరం న్యాయసేవాధికార సంస్ధ స్టాల్స్ ను బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్ అబ్బినేని విజయకుమార్, డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి తో కలిసి ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట డైరెక్టర్ కుముధిన్ సింధూ, యంఇఓ నరసింహామూర్తి, న్యాయవాదులు, బార్ అసోషియేషన్ సభ్యులు, విద్యార్ధినీ విద్యార్ధులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.